ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 27 August 2026, 7:39 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

మంచిర్యాలలో ఈనెల 31న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభోత్సవం……. మంచిర్యాల :

మంచిర్యాల :
అర్జున్ సమాచారం:
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రాంలో భాగంగా మంచిర్యాల మెడికల్ గోడౌన్ ప్రాంగణంలో నిర్మించిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను ఈనెల 31వ తేదీన ప్రారంభించనున్నారు.
ఈ కిచెన్‌కు హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ అమలు భాగస్వామిగా వ్యవహరిస్తోంది ఆధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ మంచిర్యాల  విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించనున్నారు.
ఈ కిచెన్ ద్వారా 17 మండలాల్లోని 691 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 42,450 మంది విద్యార్థులకు అలాగే 13 జూనియర్ కాలేజీల్లో చదువుతున్న 6,654 మంది విద్యార్థులకు ప్రతిరోజూ బ్రేక్‌ఫాస్ట్ అందించనున్నారు
కిచెన్ పరిధిలోని
మంచిర్యాల జిల్లా లోని
మంచిర్యాల బెల్లంపల్లి జన్నారం మందమర్రి లక్సెట్టిపేట దండేపల్లి కాజీపేట నెన్నాల్ హాజీపూర్ నాస్పూర్ భీమారం.
ఈ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ద్వారా వేలాది మంది విద్యార్థులకు ప్రతిరోజూ పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించనున్నారు. విద్యార్థులు ఉదయం పూట ఆకలితో పాఠశాలకు వెళ్లకుండా ఆరోగ్యకరమైన అల్పాహారంతో ఉత్సాహంగా విద్యను అభ్యసించేందుకు ఈ కార్యక్రమం దోహదపడనుంది.
=======================